Tuesday, May 4, 2010

ప్రియ నేస్తం

ప్రియ నేస్తం.... ప్రపంచం అంతా దూరం అయినా... నీకునేనుఉన్నా అని చెప్పేవాడేస్నేహితుడు”... స్ధానంలో నాకునాకు నువ్వు” “నీకు నేనుఒకరి కొకరు.. స్నేహమే మన ప్రపంచంనువ్వుఅనే రెండక్షరాలే నా చేయి పట్టినడిపిస్తుంటే...నువ్వు అనే రెండక్షరాలే నా జీవితానికో మార్గాన్ని వేస్తుంటే...నువ్వు అనే రెండక్షరాలే నన్ను ఇంతగాప్రభావితం చేస్తుంటే.....ఇంతకు ముందెపుడూ, నేనెరుగని మమతాను భంధమేదో... నువ్వు నా చుట్టూ పెనవేస్తుంటే.....నీస్నేహ మాధుర్యాన్ని నాకు చవిచూపిస్తుంటే ........... నాకు నువ్వు వున్నావనే భావన.....మనసు కి ఎంతో ఊరటనిస్తుంటే, నిలువెత్తు నీ రూపాన్ని భద్రంగా నా గుండెల్లో దాచుకొని..... ప్రపంచానికంతా వినపడేలా అరిచి చెప్పాలని వుంది..... “ఇదిగో నా ప్రియ నేస్తం అని

న మనసు మూగబోయింది

నువ్విక దురమౌతున్నావని తెలిసి నా మనసు మూగబోయింది...ఎద నిండా ఎగసిపడే ని జ్ఞాపకాల అలలనుఆపలేకపోతోంది...

కాలంతో
పాటు వచ్చిన కన్నీటిని ,నీ జ్ఞాపకాలను కాలమే చేరిపెస్తుందనుకున్నా..స్వచ్చమయిన నా ప్రేమశాశ్వుతమని తెల్సుకోలేక పోతున్నా..
ఎదనిండా
నిండి పోయిన వేదన ఇంకేన్నాల్లో ఆలోచిస్తున్నా...

నిన్ను
మరిచి జీవించడానికి ప్రయత్నిస్తున్నా..
కానీ
లోలోపల మనసు కార్చే కన్నీటిని ఆపలేకపోతున్న...

నన్నొదిలి
వెళ్ళిపోతున్న నీకు వీడ్కోలు చెబుతున్నా..
అలాగే
నీపై నాకున్న ప్రేమ శాశ్వుతమని కుడా చెబుతున్నా..

కుల మత విభేదాలను దాటి తమ ప్రేమను సాధించుకునేది కొందరే..అందులో మనం లేమే అనిబాధపడుతున్నా...
ఎక్కడున్నా
..ఎవరితో ఉన్నా నీ జీవితం సంతోషంగా ఉండాలని ఆశపడుతున్నా...

నీ
జీవితంలో నేనేప్పుడయినా తారసపడితే , నీనుంచి నేనశించేది ఒక్కటే..అదీ నీ చిరునవ్వే.....
అప్పటికీ
నీపై నా కున్న ప్రేమ శాశ్వుతమని చెప్పడానికి సాక్షి కుడా ఒక్కటే..అదీ క్షణంలో నా కళ్ళల్లోమెదిలే కన్నీరే....

నువ్వే న లోకం

ఆశల గూటిలో కనుపాపలు
విశ్రాంతి కోసం ఆవులిస్తున్నప్పుడు
ఏకాంత మందిరంలోనే
నిత్యం ఉండిపోవాలనే
నా ఆనవాళ్ళ వలయాలు
నన్ను శాసిస్తున్నప్పుడు
హృదయ తంత్రుల మీద
వచ్చి చేరిన నీ పలకరింపు
మూగవోయిన నా మనోఫలకంపై
చెరగని ముద్ర వేసి
ఒంటరి వేదిక మీద
రాత్రంతా మాట్లాడుతూనే ఉంది
ఉహల్లో తప్ప జీవితం గూర్చి
తలపునకు రాని నాకు
నీ చిరునవ్వు వాస్తవంలో ప్రతిబింబించి
మన మధ్య సందిగ్ధ వారథిని దాటించిన తీరు
అభిమానమో.. ఆత్మీయతా బంధమో ..
అనురాగమో...
ఏదో తెలియని ఒక స్పర్శ
అలలా తాకి...
అంతుచిక్కని భావమేదో
మనసుల్ని దరిచేర్చి
హృదయాంతరాలలో
అంతరించిపోయిన
నా ఆశయాన్ని
వెలికి తీసింది..
నేస్తం..
ఇది నిజం...
ఈ జన్మకు నేను
నీకై నిరీక్షించే గుండెను మాత్రమే..
మరో జన్మంటూ ఉంటే..
నిత్యం పరిమళభరితంగా
జీవం పోసుకునే
నీ చేతి పదమునై జన్మిస్తా..
విశ్వమంతా 'నువ్వే నా లోకం'
అని చాటి చెబుతా..!

అదే జ్ఞాపకం

అదే జ్ఞాపకం
పదే పదే
మనస్సుని తడుముకుంటూ

ఇన్నేళ్లైనా
క్షణం క్రితమే
జరిగిన౦త కొత్తగా

మరిచిపోవటం అనేది
అన్నింటికీ కాదేమో
నీ జ్ఞాపకాలకు అస్సలే కాదు

గతం ప్రతీ రోజు తరుముతూనే ఉంది
నువ్వు ఎక్కడ ఉన్నావో వెతకమని
ప్రస్తుతం ఆపుతోంది.. ప్రతి అడుగుని
నిన్ను జ్ఞాపకం గానే ఉంచమని

వేసే ప్రతి అడుగులో
తీసే ప్రతి శ్వాసలో
నీ జ్ఞాపకం

ఎక్కడో... ఎప్పుడో
నువ్వు ఎదురుపడితే
ఇదీ...అని చెప్పుకోడానికే
ఈ మాత్రం అయినా గెలిచింది

నాకు... ఎంత దూరంలో
నువ్వున్నావో... తెలియదు
మనస్సుకి.. ఎంత దగ్గరగా ఉన్నావో మాత్రమే తెలుసు

కళ్ళు మూసుకొని ఎప్పూడూ... నిన్ను చూస్తూనే ఉన్నా
ఊపిరి ఆగేలోపు.. ఒక్కసారి
కళ్ళు తెరిచి చూడాలని... ఎదురుచూస్తున్నా...

ఓడిపోయాను

ఓడిపోయాను ..కాని ఎవరి గెలుపో కాదిది , న ఓటమి మాత్రమే !

మనమంతా ఒక్కటే అనుకొన్న నా మంచితనపు ఓటమి ..
అవసరాల్లో వున్నవారిని అధుకొన్న ఆదరణ ఓటమి..
స్నేహితుల మీద పెంచుకొన్న నమ్మకం ఓటమి..
న వాళ్ళతో పంచుకొన్న అబిమానం ఓటమి..
నీ కోసం నేనున్నానని చెప్పిన ధర్యం ఓటమి..

ఎవరి గెలుపో కాదిది , నా ఓటమి మాత్రమే..!

మాట తప్పని సోంస్కృతి నదనుకున్నను ..
మాటలతో అతలడుతున్న మాటల మంత్రికుల మధ్య ..
మనసున్న మనిషిగా మనుగడ సాదించలేక ..
మర్మమున్న మన్సిగా మన్ననలు పొందుతున్నాను
మారుతున్న కాలంతో పటు నేను మరిపోయా మర మనిసిల..

అందుకే ఎవరి గెలుపో కాదిది , నా ఓటమి మాత్రమే !

Tuesday, December 29, 2009

ని పరిచయం

నీ పరిచయం నా జీవితం లో వరం...
నిన్ను చుసిన క్షణం..మరణం వరకు నా గుండెలో పదిలం..
అమావాస్య నుండి పౌర్నమిలా రోజు రోజుకు కొత్త కాంతి సంతరించుకొంటుంది మన బంధం..
ప్రతి క్షణం నిన్ను చూడాలనే ఆరాటం..
నిన్ను కలిసినప్పుడు నీతో మాట్లాడకుండా ఆపెస్తోంది.. చిన్ని మొహమాటం...
హృదయ స్పందన పెరిగిపోతోంది క్షణం..
ఎందుకో భలేగా అనిపిస్తుంది.. నిమిషం లో మనిద్దరి మౌనం..
అంతలోనే మనల్ని చూసి ఎవరైన.. తప్పుగా అనుకుంటారేమో నని చిన్న భయం..
అద్దం లో ప్రతిబింబంలా కనిపిస్తోంది..నీ మనసులో నా రూపం..
కానీ ప్రతిబింబం నాదేనని చెప్పే నీ హృదయాన్ని ఆపెస్తోంది నీ మౌనం ..
ఎప్పుడు తటస్థంగా ఉండే నీ మాటలు..అప్పుడప్పుడు కావాలని నన్ను దూరంచేసే నీ ప్రయత్నం..
అలాంటి నీ చేష్టలు నా మదిలో రేపుతాయి కలవరం....
నిశీధిలో నక్షత్రాల్లా నా మనసు నికేప్పుడో బహిర్గతం..
ఆశలన్నీ ఆవిరి చేసి, వేదన మిగిల్చి వేడుక చూస్తావో ..లేక కాల సాగరంలో నా జీవిత నావపై కడదాక నాతొ కలసి వస్తావో ..............నీ ఇష్టం...............
........................నీ