Tuesday, December 29, 2009

ని పరిచయం

నీ పరిచయం నా జీవితం లో వరం...
నిన్ను చుసిన క్షణం..మరణం వరకు నా గుండెలో పదిలం..
అమావాస్య నుండి పౌర్నమిలా రోజు రోజుకు కొత్త కాంతి సంతరించుకొంటుంది మన బంధం..
ప్రతి క్షణం నిన్ను చూడాలనే ఆరాటం..
నిన్ను కలిసినప్పుడు నీతో మాట్లాడకుండా ఆపెస్తోంది.. చిన్ని మొహమాటం...
హృదయ స్పందన పెరిగిపోతోంది క్షణం..
ఎందుకో భలేగా అనిపిస్తుంది.. నిమిషం లో మనిద్దరి మౌనం..
అంతలోనే మనల్ని చూసి ఎవరైన.. తప్పుగా అనుకుంటారేమో నని చిన్న భయం..
అద్దం లో ప్రతిబింబంలా కనిపిస్తోంది..నీ మనసులో నా రూపం..
కానీ ప్రతిబింబం నాదేనని చెప్పే నీ హృదయాన్ని ఆపెస్తోంది నీ మౌనం ..
ఎప్పుడు తటస్థంగా ఉండే నీ మాటలు..అప్పుడప్పుడు కావాలని నన్ను దూరంచేసే నీ ప్రయత్నం..
అలాంటి నీ చేష్టలు నా మదిలో రేపుతాయి కలవరం....
నిశీధిలో నక్షత్రాల్లా నా మనసు నికేప్పుడో బహిర్గతం..
ఆశలన్నీ ఆవిరి చేసి, వేదన మిగిల్చి వేడుక చూస్తావో ..లేక కాల సాగరంలో నా జీవిత నావపై కడదాక నాతొ కలసి వస్తావో ..............నీ ఇష్టం...............
........................నీ

2 comments: