నువ్విక దురమౌతున్నావని తెలిసి నా మనసు మూగబోయింది...ఎద నిండా ఎగసిపడే ని జ్ఞాపకాల అలలనుఆపలేకపోతోంది...
కాలంతో పాటు వచ్చిన ఈ కన్నీటిని ,నీ జ్ఞాపకాలను కాలమే చేరిపెస్తుందనుకున్నా..స్వచ్చమయిన నా ప్రేమశాశ్వుతమని తెల్సుకోలేక పోతున్నా..
ఎదనిండా నిండి పోయిన ఈ వేదన ఇంకేన్నాల్లో ఆలోచిస్తున్నా...
నిన్ను మరిచి జీవించడానికి ప్రయత్నిస్తున్నా..
కానీ లోలోపల మనసు కార్చే కన్నీటిని ఆపలేకపోతున్న...
నన్నొదిలి వెళ్ళిపోతున్న నీకు వీడ్కోలు చెబుతున్నా..
అలాగే నీపై నాకున్న ప్రేమ శాశ్వుతమని కుడా చెబుతున్నా..
ఈ కుల మత విభేదాలను దాటి తమ ప్రేమను సాధించుకునేది కొందరే..అందులో మనం లేమే అనిబాధపడుతున్నా...
ఎక్కడున్నా ..ఎవరితో ఉన్నా నీ జీవితం సంతోషంగా ఉండాలని ఆశపడుతున్నా...
నీ జీవితంలో నేనేప్పుడయినా తారసపడితే , నీనుంచి నేనశించేది ఒక్కటే..అదీ నీ చిరునవ్వే.....
అప్పటికీ నీపై నా కున్న ప్రేమ శాశ్వుతమని చెప్పడానికి సాక్షి కుడా ఒక్కటే..అదీ ఆ క్షణంలో నా కళ్ళల్లోమెదిలే కన్నీరే....
Tuesday, May 4, 2010
న మనసు మూగబోయింది
Subscribe to:
Post Comments (Atom)

No comments:
Post a Comment